'నేను శైలజ'ను డౌన్ లోడ్ చేస్తే.. 2 లక్షలు జరిమానా!

కొత్త ఏడాది ‘నేను శైలజ’ విజయంతో శుభంగా ఆరంభమైంది.ఇక్కడ మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతూ విజయపథంలో దూసుకెళుతోంది.

 Nenu…sailaja Piracy… Court Orders In Differrent Countries-TeluguStop.com

శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్, కీర్తి సురేశ్ జంటగా కృష్ణచైతన్య సమర్పణలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.కాగా, విడుదలయ్యే ప్రతి సినిమా దాదాపు పైరసీకి గురవుతున్న విషయం తెలిసిందే.

ఇక, హిట్ సినిమా అంటే పైరసీదారులు వదిలిపెడతారా? ప్రస్తుతం ‘నేను శైలజ’ విషయంలో అదే జరుగుతోంది.ఈ చిత్రం అనధికారిక కాపీని ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ చేసుకుని, చూస్తున్నారు.

ఇది ‘స్రవంతి మూవీస్’ దృష్టికి వెళ్లడంతో చిత్రనిర్మాత రవికిశోర్ తగిన చర్యలు తీసుకుంటున్నారు.ఆ విషయంలోకి వస్తే.
‘నేను శైలజ్’ను డౌన్ లోడ్ చేస్తున్న వారి ఐపీ అడ్రస్ ను అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో తెలుసుకుని, వారి మీద తగిన చర్యలు తీసుకోనున్నారు.డౌన్ లోడ్ చేసుకుని చూసేవాళ్లకు 2 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని రవికిశోర్ తెలిపారు.

పైరసీ చేసేవాళ్లను చట్టపరంగా ఎదుర్కొంటామనీ, వారికి కఠిన శిక్ష తప్పదనీ ఆయన స్పష్టం చేశారు.ఇంకా రవికిశోర్ మాట్లాడుతూ – ”అనధికారిక కాపీని డౌన్ లోడ్ చేసేవాళ్లకు ఐదు వేల నుంచి ఏడు వేల ఆస్ర్టేలియన్ డాలర్లు జరిమానా విధించవచ్చని ‘డల్లాస్ మూవీ బయ్యర్స్ క్లబ్’కు ఇటీవల ఆస్ర్టేలియన్ కోర్టు అనుమతినిచ్చింది.

పలు వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.యూస్ లో కూడా వార్నర్ బ్రదర్స్ సంస్థ డౌన్ లోడ్ చేస్తున్నవారికి 20 డాలర్లు జరిమానా విధిస్తోంది.

భారతీయ చట్ట ప్రకారం రెండు లక్షల రూపాయలు జరిమానా విధించవచ్చు.ఈ నేపథ్యంలో ‘నేను శైలజ’ను డౌన్ లోడ్ చేస్తున్నవారి ఐపీ అడ్రస్ లను సేకరిస్తున్నాం.

అందరికీ చట్టపరంగా నోటీసులు పంపించనున్నాం” అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube