సూపర్ స్టార్ రజినీకాంత్ ‘రోబో’ చిత్రం తర్వాత వచ్చిన చిత్రం ‘లింగ’.భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘లింగ’ చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలింది.2014లో బిగ్గెస్ట్ ఫ్లాప్ ‘లింగ’ అంటూ ప్రచారం జరిగింది.రజినీకాంత్ తన అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చాడు అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే తాజాగా ఆ చిత్ర దర్శకుడు మీడియాలో అప్పుడు వచ్చిన వార్తలను తప్పు పట్టాడు.‘లింగ’ ఫ్లాప్ అనే వార్తలు వాస్తవం కాదు అని, 2014లో అత్యధిక గ్రాస్‌ను వసూళ్లు చేసిన చిత్రాల్లో ‘లింగ’ నెం.1 అంటూ చెప్పుకొచ్చాడు.
తాజాగా దర్శకుడు కెయస్ రవికుమార్ మాట్లాడుతూ.
లింగ చిత్రం తన కెరీర్‌లో చాలా ప్రత్యేకం అని, ఆ సినిమా 2014లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచిందని, అది తనకు ఎంతో గర్వ కారణం అని చెప్పుకొచ్చాడు.ఒక చిత్రం 158 కోట్ల రూపాయలను వసూళ్లు చేస్తే ఎలా ఫెయిల్ అయ్యిందని అంటారు అంటూ దర్శకుడు ప్రశ్నిస్తున్నాడు.
అయితే నిర్మాతకు లాభాల పంట పండొచ్చు కాని, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కోట్లలో నష్ట పోయారు.ఈ విషయం దర్శకుడికి తెలుసో లేదో.ఇప్పటికి కూడా ‘లింగ’ డిస్ట్రిబ్యూటర్లు ఆర్థికంగా కోలుకోలేక పోతున్నారు అంటే ఏ స్థాయిలో ‘లింగ’ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పవచ్చు.దర్శకుడు చెబుతున్న కాకి లెక్కలు అబద్దం అని తమిళ సినీ వర్గాల వారు చెబుతున్నారు.







