కిడ్నీ రాకెట్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.చెడు వ్యసనాలకు బానిసలైన యువకులు .
కిడ్నీలను ఇడ్లీలా అమ్మేస్తున్నారు.మొన్న నల్గొండ.
నిన్న ఖమ్మం జిల్లా.ఎక్కడ చూసిన కిడ్నీ స్టోరీలే.
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుర్రాడు.ఏకంగా కొలంబో వెళ్లొచ్చాడు.
అసలు తన కిడ్నీ తానే అమ్ముకున్నాడా.? లేక ముఠా సభ్యులు అమ్మేశారా.? కోలంబో ఎలా వెళ్లాడు.? విజయవాడలో ఉండి.చెన్నయ్ లో ఉన్నానని ఎందుకు అబద్ధం చెప్పాడు.? ఈ కిడ్నీ రాకెట్లో ఎవరెవరు ఉన్నారు.?
ఈ యువకుడి పేరు మువ్వా నరేష్.ఖమ్మం జిల్లా నాయుడుపేటకు చెందిన ఇతను బీటెక్ చదివాడు.
హాయిగా ఉద్యోగం చేసుకోకుండా కిడ్నీ రాకెట్ మాయలో పడ్డాడు.ఏమైందో ఏమో.చెప్పపెట్టకుండా కొలంబో వెళ్లొచ్చాడు.చెన్నై వెళ్లొచ్చానని.
తన కిడ్నీ ఎవరో కాజేశారని.మూడు లక్షలిస్తే తన కిడ్నీ తనకు ఇచ్చేస్తారని తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు.
నరేష్ ఫోన్ కాల్ తో కంగారు పడిన పేరేంట్స్.సత్తుపల్లి డీఎస్పీకి కంప్లయింట్ చేశారు.
నరేష్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతనున్నది చెన్నయ్ లో కాదని.విజయవాడలో ఉన్నాడని కనుగొన్నారు.విజయ్ ఆచూకీ కనుగొని ప్రశ్నిస్తే.అర్థపర్థంలేని సమాధానాలు చెప్పాడు.
తనను ఉద్యోగం పేరిట కొలంబో తీసుకువెళ్లారనీ.అక్కడ కిడ్నీ తీసుకుని.
చెన్నయ్ లో వదిలేశారని స్టోరీలు చెప్పాడు.క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పెడితే తిరిగి కిడ్నీ ఇచ్చేస్తామన్నారని పోలీసులకు చెప్పుకొచ్చాడు.
నరేష్‌కు మొదటినుంచీ క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొనే వ్యసనం ఉందనీ బంధువులే ఆఫ్‌ది రికార్డుగా అంగీకరిస్తున్నారు.చెడు వ్యసనాలకు బానిసైన నరేష్.కిడ్నీ అమ్ముకుని.ఇప్పుడు కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడే సరికి ప్లేటు ఫిరాయించి తనకు తెలియకుండా మోసం చేసారని స్టోరీ అల్లుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
నరేష్ చెప్తున్నదాంట్లో నిజనిజాలు వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు.ఈ కేసుపై ఫోకస్ పెట్టిన ఖమ్మం పోలీసులు.కిడ్నీ డొంకను కదిలించే పనిలో పడ్డారు.నల్లగొండ నుంచి బయలుదేరిన ఈ కిడ్నీ ముఠా ఖమ్మం మీదుగా చెన్నయి నుంచీ కొలంబోకు చేరుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
నరేష్ సహకారంతో కిడ్నీ ముఠాను త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.







