ఉద్యోగంలోంచి తీసేసిన పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్ కి కోపమొచ్చింది.దానికి కారణం తన స్టాఫ్.

మరి ఏం చేసాడు ? అందరిని ఉద్యోగంలోంచి తీసిపడేసాడు.

ఎంతమందిని ? 25 మందిని ఉద్యోగంలోంచి పీకేసాడు.వామ్మో అంతలా కోపం ఎందుకుకోచ్చింది అనుకుంటున్నారా.

మరేం చేస్తారు ఆయన.చెప్పిన మాట ఎంతకీ వినలేదు వాళ్ళు.వారి కారణంగా పూరి కన్నడలో తీస్తున్న రోగ్ షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది.

" అవును, నా టీమ్ మొత్తాన్ని ఉద్యోగంలోంచి తీసేసాను, నా దగ్గర చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.అదే అసలు ప్రాబ్లం.వాళ్ళ నా మాట వినడం మానేసారు.

Advertisement

వాళ్ళల్లో వాళ్ళు కుడా ఒకరి మాట ఒకరు వినడం మానేశారు.నేను రెండు సంవత్సరాల క్రితమే వార్నింగ్ ఇచ్చాను.

కాని వినలేదు.మనం ఒక టీమ్ లా పనిచేయట్లేదు.

ఇదే పధ్ధతి కంటిన్యు అయితే మనకే నష్టం అని చెప్పాను.అయినా వినలేదు.

ఇంకా ఓపిక పట్టలేక టీమ్ మొత్తాన్ని పీకేసాను.ఇప్పుడు ఆఫీస్ లో నేను ఒక్కడినే ఉన్నాను " త్వరలోనే కొత్త టీంని ఏర్పరుచుకుంటారంటా పూరి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?

పాతికమంది కొత్తవాళ్ళని ఎంత త్వరగా వీలయితే అంట త్వరగా పట్టేసి, సినిమాను పూర్తీ చేస్తారంట.

Advertisement

తాజా వార్తలు