సూపర్ స్టార్ మహేష్ బాబు 15 రోజులకు పైగా విశ్రాంతిలో ఉన్నారు.కారణాలు ఏవైనా, 4వ తేదికి హైదరాబాదులో మొదలవాల్సిన షెడ్యూల్ వాయిదా పడింది.
ఈ షెడ్యూల్ ఇప్పుడే మొదలుపెట్టరు అంట.దీనికి బదులుగా చెన్నైలో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేసారు.ఈ నెల 10వ తేది నుంచి ఈ షెడ్యూలు మొదలుపెట్టనున్నారు.ఇకపోతే నెలన్నర రోజులకు పైగా సెలవులు ఎంజాయ్ చేసిన మన సూపర్ స్టార్ కి ఇప్పుడు సెలవులు దొరకడం కష్టంగా ఉంది.
ఈ సంక్రాంతి పండక్కి బ్రహ్మోత్సవం యూనిట్ మొత్తానికి సెలవు దొరుకుతోంది కాని మహేష్ కి దొరకడం లేదు.అయితే మహేష్ పండగ పూట బ్రహ్మోత్సవం షూటింగ్ లో పాల్గొనటం లేదు… యాడ్ షూటింగ్ లో పాల్గొంటాడు.
దర్శకనిర్మాతలు కాస్త అడ్జస్ట్ అవుతారు కాని కార్పోరేట్ కంపెనీలు అలా కాదు కదా! కొట్లలో పేమెంట్ ఇవ్వడంతో పాటు కండీషన్ల మీద కండిషన్లు పెడతారు.అందుకే మహేష్ ఈసారి పండగ జరుపుకోవడం లేదు.
న్యాయంగా ఆలోచిస్తే కార్పోరేట్ కంపెనీల తప్పేమి లేదు.తారలు గడిపే గంటల సమయానికి కొట్లు ఇస్తున్నప్పుడు అడ్జస్టు అవడం ఎవరి వల్ల అవుతుంది.
మొత్తానికి మహేష్ కి సెలవులు దొరకడం లేదు.