చంద్రబాబు కూడా భారీ యాగానికి ప్లాన్ చేస్తున్నారా ?

మీడియా లో ఆయుత చండీయాగానికి వచ్చిన కవరేజీ అంతా ఇంతా కాదు.

మీడియా లో లైవ్ అప్డేట్ ల దగ్గర నుంచీ కేంద్ర మంత్రులు సైతం హాజరు అవడం పెద్ద విశేషంగా మారింది.

దీనికి తోడు భక్తిప్రపత్తులతో సామాన్యులు క్యూ కడితే, యాగం చేసిన వారిని ప్రసన్నం చేసుకోవడానికి వీఐపీలు క్యూలు కట్టారు! కోట్లాను కోట్లు ఖర్చు అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ యాగాన్ని ప్రశ్నించనేలేదు.తెలంగాణా వస్తే యాగం చేస్తాను అని కెసిఆర్ వ్యక్తిగతంగా చేసుకున్న మొక్కు కోసం తెలంగాణా ఖజానా లో డబ్బు ఎలా ఖాళీ చేస్తారు అంటూ ఒక్క మీడియా వ్యక్తి కూడా అడగలేదు.

ఈ యాగం తరవాత ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి అనేది పెద్ద చర్చ గా సాగింది.అసలు యాగానికి పెద్దగా ఖర్చు కూడా కాదని.

యాగం ఆలోచన చేస్తే చాలు.స్పాన్సర్లు ముందుకు వస్తున్నారని కూడా స్పష్టం అయ్యింది.

Advertisement

మరి ఇంకేముంది.ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి యాగాన్ని చేసే ఆలోచన ఒకటి పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం.

చంద్రబాబు గారి అమరావతి ఎలాగూ ఉంది కాబట్టి అక్కడ ఒక భారీ యాగం చెయ్యాలి అనేది అధికార పార్టీ సంకల్పంగా తెలుస్తోంది.ఇది గనక జరిగితే దేశంలోని ప్రముఖులను , సింగపూర్ వాళ్లను కూడా పిలిపించుకోవచ్చు.

యాగం గురించి వర్ణించిచెప్పడానికి ఇక మీడియా ఉండనే ఉంది! .

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు