హైదరాబద్ ని ఐటీ హబ్ గా మార్చిన ఘనత తనదే అని ఎప్పుడూ డబ్బా కొట్టుకునే చంద్రబాబు గారు సత్య నాదెళ్ళ ని అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ కహానీలు చెబుతున్నారు అని ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.సత్య నాదెళ్ళ తెలుగు వాడు హైదరాబాదీ కూడా.” హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి లో నా చెయ్యి ఎక్కువగా ఉంది, ఇప్పుడు విశాఖ – అనంతపురం లలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదే .మీ సహకారం ఈ విషయంలో నాకు ఖచ్చితంగా కావాలి ” అంటూ చెప్పుకొచ్చారు.పైగా ” హైదరాబాద్ లో అప్పట్లో బిల్ గేట్స్ మైక్రో సాఫ్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తాం అని మాట ఇచ్చారు దాన్ని నెరవేర్చారు కూడా.ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ ఇలా ఉంది అంటే మా ఇద్దరి వల్లనే మీరు పూనుకుని ఏపీ ప్రాంతం లో కూడా ఒక మైక్రో సాఫ్ట్ పెట్టి తీరాలి ” అన్నారు చంద్రబాబు.
సత్య నాదెళ్ళ మరి చంద్రబాబు మాట నేరవేరుస్తారో లేదో చూడాలి !
.






