త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుసగా హీరోయిన్ సమంతకు ఆఫర్లు ఇస్తూ వస్తున్నాడు.‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తాజాగా ‘అ ఆ’ చిత్రంలో సమంతకు త్రివిక్రమ్ ఆఫర్ ఇచ్చాడు.
ఇలా వరుసగా సమంతకు ఆఫర్లు ఇచ్చిన త్రివిక్రమ్ మరోసారి ఈమెకు ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.సూర్య హీరోగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కబోతున్న చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఆ సినిమాలో కూడా సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది.కాని తాజాగా త్రివిక్రమ్ కొత్త హీరోయిన్ కోసం వెదుకుతున్నట్లుగా తెలుస్తోంది.
సూర్య ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాలో నటించబోతున్నాడు.ఆ సినిమా కోసం ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు.
‘సన్నాఫ్ సత్యమూర్తి’ మరియు ‘అ ఆ’ చిత్రాలను నిర్మించిన రాధాకృష్ణనే సూర్య హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.ఈ నిర్మాత తాజాగా బాలీవుడ్ అందాల తార దీపిక పదుకొనెతో చర్చలు జరిపాడు.
సూర్యకు జోడీగా ఈమెను ఎంపిక చేసేందుకు ఈయన ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.దాంతో సమంతకు త్రివిక్రమ్ విడాకులు ఇచ్చినట్లేనని, దీపికాతోనే త్రివిక్రమ్ తన తర్వాత సినిమాను తెరకెక్కిస్తాడనే చర్చ జరుగుతోంది.
అతి త్వరలోనే దీపిక ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి.







