అభిమానికి వింత వ్యాధి, వెళ్లి కలిసిన మెగాస్టార్

ఈ చిత్రాన్ని ఒక్కసారి గమనించండి.చిత్రంలో ఆమీర్ ఖాన్ తో కనిపిస్తున్న అబ్బాయి పేరు నిహాల్ బిట్ల.

 Aamir Khan Meets His Fan Suffering With Progeria-TeluguStop.com

వయసు 14 సంవత్సరాలు.నిజంగానే 14 సంవత్సరాలు.

మీరు ఎందుకు నమ్మట్లేదో తెలుసు.ఆ అబ్బాయిని చూస్తోంటే వయసు చాలా ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తున్నా, అతను ఇంకా పదహారేళ్ళ వయసు కుడా రాని పిల్లాడే.

పాపం, ప్రోజేరియా అనే వింత వ్యాధితో బాధపడుతున్నాడు.ఈ వ్యాధితో బాధపడే పిల్లలు తమ వయసు కన్నా ఎన్నోరెట్లు పెద్దగా కనిపిస్తారు.

శరీరం బక్కచిక్కిపోతుంది.ముడతలు వచ్చేస్తాయి.

ఎనిమిది లక్షల మంది పిల్లల్లో ఒకరికి ఈ వ్యాధి ఉంటుంది.

ఈ పిల్లాడికి ఆమీర్ ఖాన్ అంటే పిచ్చి.

చిన్ననాటి నుంచి అమీర్ కి తానొక వీరాభిమాని.అమీర్ దర్శకుడిగా తెరకెక్కించిన “తారే జమీన్ పర్ ” చిత్రాన్ని చూసి తన జీవితం పట్ల సానుకూల దృక్పథంతో మెలగటం మొదలుపెట్టాడంటా.

ఆ చిత్రమే తనకి కొండంత ధైర్యాన్ని ఇచ్చిందట.అమీర్ ఖాన్ ను కలవడమనేది తన కల .ఇదే విషయాన్ని ఆ అబ్బాయి మీడియాతో పంచుకున్నాడు.విషయం ఆమీర్ దాకా వెళ్ళింది.

తన అభిమానిని వెళ్లి కలిసాడు ఆమీర్.తనకి ఆటబొమ్మలు తీసుకెళ్ళి, సేల్ఫీలు దిగి, కాసేపు ఆడించి, ముచ్చట్లు పెట్టి, కేవలం ఆ అబ్బాయికే కాకుండా, అలాంటి పిల్లలను ఆడుకుంటున్న సంస్థలకు అండగా నిలబడుతానని మాటిచ్చాడు ఆమీర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube