ఎటు తేల్చుకోలేకపోతున్న అఖిల్

అక్కినేని అఖిల్ కి ఏమి చేయాలో అర్థం కావట్లేదు.ఈ దారిలో వెళ్ళాలో తోచట్లేదు.

 Akhil In Big Confusion-TeluguStop.com

ఎవరితో కలిసి పనిచేయాలో అంతుపట్టడం లేదు.ఇందుకు కారణం మొదటి సినిమా దారుణంగా దెబ్బతినడమే.30 కోట్ల నష్టాలతో డిస్ట్రిబ్యుటర్స్ కి రక్తకన్నీరు తెప్పించింది అఖిల్ – ది పవర్ ఆఫ్ జువా.

క్రిష్ ఒక కథ చెప్పాడు, కాని ఎక్కడో భయం.డ్యాన్స్, ఫైట్లు బాగా చేసేవాడికి అంత క్లాస్ సినిమా ఎందుకని.విక్రమ్ కుమార్ తో కుడా చేర్చిస్తున్నారు.

కాని అటు విక్రం మాత్రం 24 తరువాత అల్లు అర్జున్ , మహేష్ బాబులతో వరుస సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు.ఇంత బిజీ షెడ్యుల్ లో విక్రం ని ఫోర్స్ చేయడం ఎంతవరకు కరెక్టు అనేది అఖిల్ ఆలోచన.

మరోవైపు పూరి జగన్నాథ్ తో సినిమా తీయమని బండ్ల గణేష్ అఖిల్ వెంటపడుతూనే ఉన్నాడు.ఎటువైపు వెళ్ళాలి, ఎలాంటి సినిమా తీయాలి ? స్టార్ గా ఎదగాలా లేక ముందు నటుడిగా నిరూపించుకోవాలా !

అఖిల్ కి అర్థం కాని విషయం ఇదే.నాగార్జున గత నెలరోజులుగా అఖిల్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు.కాని విషయం ఇంతవరకు తేలలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube