తెలంగాణలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది.నాయకులు ఒకరి తరువాత మరొకరు పార్టీని వదిలి వెళ్లి పోతున్నారు.
వెళ్ళిపోతున్న వారు గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు.తాజాగా మాజీ మంత్రి విజయరామా రావు వెళ్ళిపోయారు.
ఆయన ఒకప్పుడు సీబీఐ డైరెక్టరుగా పనిచేశారు.ఆ పదవినుంచి రిటైర్ అయిన తరువాత టీడీపీలో చేరారు.మంత్రి అయ్యారు.1999లో ఖైరతాబాదు నుంచి టీడీపీ తరపున గెలిచినా విజయ రామారావు 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.ఇప్పటివరకు టీడీపీ నుంచి బయటకు వచ్చిన వారంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.కాబట్టి ఈ మాజీ పోలీసు బాసు కూడా ఆ తీర్థం తాగడం కోసమే సిద్ధంగా ఉన్నారు.
గులాబీ పార్టీలోకి రావడానికి మరో టీడీపీ నాయకుడు కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం.కొన్ని రోజుల కిందట కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పసుపు పార్టీని వదిలి గులాబీ పార్టీలోకి వెళ్ళారు.
ఆయనను అనుసరించారు విజయరామారావు.టీడీపీలో పదవులు అనుభవించిన వారంతా గులాబీ పార్టీలోకి ఏ ప్రయోజనాలు ఆశించి పోతున్నారో అర్థం కావడంలేదని కొందరు అంటున్నారు.
పదవులు ఆశించే అక్కడికి పోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది.కానీ వలస వచ్చిన వారందరికీ పదవులు ఇవ్వడం కేసీఆర్కు సాధ్యం అవుతుందా?
.






