అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘సైజ్ జీరో’ చిత్రం తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈ సినిమా కోసం అంతా కూడా చాలా కష్టపడ్డారు.
అనుష్క చాలా కష్టపడి ఈ సినిమా కోసం ఏకంగా 20 కేజీల బరువు తగ్గింది.దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమా కోసం దాదాపు సంవత్సరంనర ఎంతో కష్ట పడ్డాడు.
ఈ సినిమా సక్సెస్ అయితేనే కెరీర్ ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో ప్రకాష్ కష్టపడటం జరిగింది.ఇక ఈ సినిమా నిర్మాత కష్టపడకున్నా కథ బలమైనది కాకున్నా కూడా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం అయినా 35 కోట్ల బడ్జెట్‌ను పెట్టాడు.
ఇంతమంది ఇంతగా కష్టపడ్డా కూడా ‘సైజ్ జీరో’ చిత్రం ఫలితం చివరకు జీరో అయ్యింది.పెట్టిన పెట్టబడి తిరిగి వచ్చినా సంతోషించే రోజులు ఇవి.అలాంటిది ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడుతో కలిపి కూడా కనీసం 25 శాతం వసూళ్లను రాబట్టలేదు అని సినీ వర్గాల వారు అంటున్నారు.మొత్తంగా ఈ సినిమా 8 కోట్ల రూపాయలను మాత్రమే వసూళ్లు చేయగలిగింది అంటూ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంత భారీ నష్టాన్ని గతంలో ‘వర్ణ’ చిత్రంతో ప్రసాద్ వి పొట్లూరి పొందాడు.ఆ సినిమాలో సైతం అనుష్క మరియు ఆర్యలు కలిసి నటించారు.మళ్లీ ఇప్పుడు ఈ సినిమా కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది.మొత్తానికి అందరి కలలను ఈ సినిమా కల్లలు చేసింది.







