సాహసం చేయబోతున్నాడా?

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ తాజాగా ‘శివమ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా రామ్‌కు షాక్‌ ఇచ్చింది.

 Ram’s Nenu Sailaja Releasing On January 1st-TeluguStop.com

డిజాస్టర్‌ ఫలితంతో ఒక్కసారిగా రామ్‌ కుదేలైపోయాడు.ఆ తర్వాత తేరుకుని నటించిన చిత్రం ‘నేను శైలజ’.

ఈ సినిమా కోసం రామ్‌ చాలా తాపత్రపడుతున్నాడు.మొదట ఈ సినిమాకు ‘హరికథ’ అనే టైటిల్‌ను పెట్టినుకున్నారు.

కాని అన్ని అననుకూల అంశాలు లేక పోవడంతో మార్చి ‘నేను శైలజ’ అనే టైటిల్‌ను నిర్ణయించడం జరిగింది.

ఇక ఈ సినిమాను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శకుడు, నిర్మాత ప్రకటించారు.

ఆడియోను ఈనెల 12న విడుదల చేసి, సినిమాను కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.జనవరిలో భారీ చిత్రాలు విడుదలకు క్యూ కట్టి ఉన్నాయి.

లెక్కకు మించిన సినిమాలు జనవరిలో విడుదల కాబోతున్నాయి.దాంతో చిన్న సినిమాలు అన్ని కూడా జనవరిపై ఆశను వదులుకున్నాయి.

ఈ సమయంలో రామ్‌ తన సినిమాను విడుదల చేయబోతుండటం సాహసం అని కొందరు అంటున్నారు.జనవరి 1 నుండి కూడా మొదలు పెట్టి చివరి వరకు పలు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.

ఇంత పోటీ మధ్యలో ‘నేను శైలజ’ చిత్రం ఆడటం కాస్త కష్టమేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube