తమిళంలో ‘వేళఇళ్ళద పట్టదారి’ చిత్రం పెద్ద విజయం సాధించడంతో తెలుగులో ‘రఘువరన్ బి.టెక్’ పేరుతో తెలుగులో కూడా విడుదలైంది.
తెలుగులో కూడా ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించింది.ఇప్పుడు తమిళంలో ‘వేళఇళ్ళద పట్టదారి’ చిత్రానికి సీక్వెల్‌గా తంగమగన్ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.
ధనుష్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం.వేల్‌రాజ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది.
ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో అనువాద చిత్రంగా విడుదల చేయనున్నారు.శరవేగంగా డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఈ చిత్రానికి ‘రఘువరన్ ఎం.టెక్’ అనే పేరు సహా పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయట.అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాను డిసెంబర్ 18న విడుదల చేయాలని తెలుగు నిర్మాతలు భావిస్తున్నారు.త్వరలోనే అధికారకమైన సమాచారం వెలువడుతుంది.పెళ్ళికి ముందు ప్రేమ, పెళ్ళి తర్వాత ప్రేమ అనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిందట.ధనుష్ సరసన సమంత, ఎమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించారు.
వీరితో పాట రాధికా శరత్ కుమార్, కె.ఎస్.రవికుమార్ కీలకపాత్రల్లో కనిపిస్తారు.







