కొట్టకపోతే ఎందుకు లొంగిపోయాడు ?

మొన్న ఈమధ్య తిరుపతి విమానాశ్రయంలో జరిగిన గొడవ చాలామందికి తెలుసు.వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి , ఆ పార్టీ ఎమ్మెల్యే చెవి రెడ్డి ఎయిర్ ఇండియాకు చెందిన స్టేషన్ మేనేజర్ మీద దాడి చేసి కొట్టారని ఆరోపణ.

 Ysrcp Mla Surrenders Before Police-TeluguStop.com

ఈ సంఘటన పెద్ద సంచలనం కలిగించింది.విమానాశ్రయ సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

తమకు ఏ పాపం తెలియదని మిథున్ రెడ్డి చెప్పాడు.కాని చెవి రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు.

ఈ ఘటనలో చెవి రెడ్డి ప్రమేయం లేకపోతే పోలీసులకు ఎందుకు లొంగిపోయాడు? చెవి రెడ్డి ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది.మిథున్ రెడ్డి సహా ఇంకొందరి మీద వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు.

రాజకీయ నాయకులు అధికారుల మీద దాడులు చేయడం, పబ్లిగ్గా కొట్టడం, నోటికి వచ్చినట్లు తిట్టడం సాధారణం అయిపొయింది.తప్పు చేసి కూడా చేయలేదని వాదిస్తారు.ఎయిర్ పోర్ట్ ఉద్యోగి తనను కొట్టకపోతే కొట్టారని ఎందుకు చెబుతాడు? అలా చెబితే రాజకీయ నాయకులు ఊరుకుంటారా? ప్రతిపక్ష నాయకులే ఇంత పొగరుగా ఉంటె అధికార పార్టీ నాయకులు ఇంకా పొగరుగా ఉంటారు.అధికారులను, ఉద్యోగులను అవమానం చేయకూడదని పార్టీల అధినేతలు నాయకులకు చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube