అధికారంలో ఉన్న పార్టీలోనే ప్రతిపక్ష నాయకులు చేరాలని అనుకుంటారు.తెలంగాణలో గులాబీ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు చేరుతుండగా, ఆంధ్రాలో టీడీపీలోకి ఇతర పార్టీల వారు చేరుతున్నారు.
రాజకీయాల్లో ఇది సహజమైన పరిణామం.ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా , ఎంపీలుగా గెలిచి రాజీనామా చేయకుండానే వేరే పార్టీలో చేరుతున్నారు.
అలాంటిది ఏ పదవులు లేనివారు చేరితే తప్పు ఏముంది? అని కొందరి అభిప్రాయం.ఆంధ్రాలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి పసుపు చొక్కాలు కప్పుకోవడానికి రంగం సిద్ధం అయింది.
పార్టీ అధినేత చంద్రబాబు వారి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.కాంగ్రెస్ నాయకులైన ఆనం సోదరులు టీడీపీలో చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఖాయమైనట్లు తెలుస్తోంది.ఆనం సోదరులు మొదట్లో టీడీపీ లోనే ఉన్నారు.
తరువాత కాంగ్రెస్ లోకి వెళ్ళారు.రామనారాయణ రెడ్డి చాలా ఏళ్ళు మంత్రిగా చేశారు.
వీరి చేరికను నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యతిరేకించారు.కానీ బాబు ఆయన్ని ఒప్పించినట్లు కనబడుతోంది.
ఆనం సోదరుల వల్ల టీడీపీకి రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయని బాబు నమ్మి ఉండొచ్చు.







