ఎనర్జిటిక్ హీరో రామ్‌లో ఎనర్జి తగ్గినట్లుగా అనిపిస్తోంది.వరుసగా రామ్‌కు ఫ్లాప్‌లు పడుతున్నాయి.
తాజాగా ఈయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘శివమ్’ చిత్రం ఇలా వచ్చి అలా పోయింది.దాంతో తాజాగా నటిస్తున్న ‘నేను శైలజా’ అనే చిత్రానికి చాలా మార్పులు చేర్పులు చేయించి, జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
మొదట ఈ సినిమాకు ‘హరికథ’ అనే టైటిల్‌ను అనుకున్నారు.అయితే ఆ టైటిల్ కంటే కూడా ‘నేను శైలజ’ అనే టైటిల్ సూటబుల్ అని రామ్ నిర్ణయించుకుని మార్చడం జరిగింది.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా ‘శివమ్’ ఫ్లాప్‌తో రీ షూట్ చేశారు.
తాజాగా ‘నేను శైలజ’ షూటింగ్ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుతున్న ఈ సినిమా ఆడియోను వచ్చే నెల రెండవ వారంలో విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు కిషోర్ తిరుమల ప్రకటించాడు.ఇక సినిమాను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ సినిమాను రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు.ఈ సినిమా అయినా రామ్‌కు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.







