ఆమీర్ ఖాన్ వివాదం రోజురోజుకి పెద్దదవుతోంది.అసలు దేశం విడిచి వెళతానని కాని, దేశం పట్ల అగౌరవంగా మాట్లాడని ఆమీర్ వాఖ్యాలను మీడియా నిజంగానే వక్రికరించింది.
దాన్ని పట్టుకొని గత రెండురోజులుగా మీడియాలో గరం గరం చర్చలు జరుగుతున్నాయి.లోకల్, నేషనల్ ఏ చానెల్ చూసినా, ఏ న్యూస్ పేపర్ తిరగేసినా అమీర్ వివాదాస్పద వాఖ్యాల చర్చలే కనిపిస్తున్నాయి.
తాజా వార్త ఏంటంటే మనోజ్ దీక్షిత్ అనే లాయర్ ఆమీర్ ఖాన్ ను దేశద్రోహిగా వర్ణిస్తూ కాన్పూర్ హైకోర్టులో కేసు వేసాడు.త్వరలో ఆమీర్ ను కోర్టులో హాజరు పరుస్తారట.
ఇకపోతే అమీర్ ఇంటి పరిసరాలు గందరగోళంగా ఉన్నాయి.రోజంతా వివిధ సంఘాల నాయకులు, బీజీపీ కార్యకర్తలు అమీర్ ఇంటి ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
దంగల్ షూటింగ్ లో పాల్గొనటానికి వెళ్ళిన ఆమీర్ తనతో పాటే భార్య కిరణ్ రావు ని కుడా వెంటబెట్టుకేల్లాడు.ఆమీర్ కు రక్షణ కలిపించేందుకు ఇప్పటికే ముంబాయి పొలిసు బలగాలు ఆమీర్ ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నాయి.
ఇక ఆమీర్ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని కొందరు హిందూ మత పెద్దలు వాదిస్తున్నారు.దేశావ్యాప్తంగా ఆమీర్ దిష్టిబొమ్మలు దగ్దం చేస్తున్నారు.
ఇవేవి పట్టించుకోకుండా ఆమీర్ ఈ రోజు నుంచి దంగల్ షూటింగ్ లో తిరిగి పాల్గొంటున్నాడు.







