ఆవు మాంసం తింటే కఠిన శిక్ష

ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు.బీజేపీ పాలనలోని హర్యానాలో.

అక్కడి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ కరడుగట్టిన ఆరెసెస్ నాయకుడు.

దీంతో ఆయన గోవధ నిషేధ చట్టం తెచ్చారు.

గోవంశ్ సంరక్షణ్ మరియు గోసంవర్ధన్ పేరుతో రూపొందించిన బిల్లుకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడంతో ఇది చట్టంగా అమలులోకి వచ్చింది.గోవులను చంపినా, గోమాంసం అమ్మినా, తిన్నా ఈ చట్టం కింద కఠిన శిక్షలు విధిస్తారు.

హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది సభ్యులు ఉన్నారు.వీరిలో ముగ్గురు ముస్లీం ఎమ్మెల్యేలు వారు కూడా ఈ బిల్లును సమర్ధించడంతో ఇదే ఏక గ్రీవంగా ఆమోదం పొందింది.

Advertisement

రాష్ట్రంలోని ముస్లీములు ఈ బిల్లును హర్షించారని ముఖ్యమంత్రి చెప్పారు.పట్టణాల్లోని వారు తమ ఆవులను పెంచుకోలేని పరిస్థితి ఉంటే వాటిని గ్రామాల్లోని తమ బంధువుల ఇళ్ళకు పంపి సంరక్షించాలని ఖత్తర్ కోరారు.

ఆవు మాంసం తింటామని కొందరు ప్రముఖ నాయకులే ప్రకటనలు చేస్తున్న పరిస్థితిలో హర్యానాలో గోవధ నిషేధ చట్టం చేయడం గోవధను సమర్ధించేవారికి బలం ఇస్తుంది.హర్యానాలోని ముస్లీములు ఈ చట్టాన్ని వ్యతిరేకించక పోవడం విశేషంగా చెప్పుకోవాలి.

Advertisement

తాజా వార్తలు