సూపర్ స్టార్ మహేష్ కి బాలివుడ్ భామ మాత్రమే సెట్ చేసే పనిలో పడ్డారు మురగదాస్ బృందం.మహేష్ – మురగదాస్ సినిమా హిందిలో కూడా వెళ్ళబోతున్న సంగతి తెలిసిందేగా.
దాని కోసం ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టిన బృందం, సూపర్ స్టార్ పక్కన బాలివుడ్ భామ ఉంటేనే కరెక్ట్ అని భావిస్తున్నారు.
ఎప్పటినుంచో ఆలియా భట్,శృతి హాసన్ ల పేర్లు వినిపిస్తొంటే తాజాగా ఈ లిస్ట్ లోకి మరో బాలివుడ్ ముద్దుగుమ్మ వచ్చి పడింది.
ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు, యువతరంలో పిచ్చి క్రేజ్ ఉన్న శ్రద్ధకపూర్.హిందిలోకి వెళ్తున్నప్పుడు హింది జనాలకు తెలిసిన అమ్మాయి అయితేనే బాగుంటుందని భావించి పై ముగ్గురిని టార్గేట్ చేసారు.
అయితే ఆలియా, శ్రధ్ధకాపూర్ లతో పోల్చుకుంటే శృతికి హిందిలో క్రేజ్ తక్కువ.అందువల్ల ఆలియా లేదా శ్రద్ధల వైపు ఓటు వేయొచ్చు.
ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించి, హింది, మలయాళ భాషల్లోకి అనువదిస్తారు.వచ్చే ఏడాది ఎప్రిల్ లో ఈ సినిమా మొదలవుతుంది.
ఇక బ్రహ్మోత్సవం హైదరబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.వచ్చే నెల 8 వ తేది నుంచి ఊటిలో ఈ చిత్రానికి సంబంధించి మరో షెడ్యూలు మొదలుపెడతారు.