కరడుగట్టిన హిందూ సంస్థల్లో విశ్వహిందూ పరిషద్ ఒకటి.దీన్ని గురించి దేశంలోని చాలామందికి తెలుసు.
అతివాద హిందూ నాయకులకు అభిమాన నాయకుడైన వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్ కన్ను మూశారు.శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సింఘాల్ గురుగావ్ లోని ఒక ఆసుపత్రిలో చనిపోయారు.
ఆయన వయసు 89 సంవత్సరాలు.అశోక్ సింఘాల్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని ప్రధాన మంత్రి నరేంద్రమోడి తన సంతాప సందేశంలో తెలిపారు.
సింఘాల్ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని పేర్కొన్నారు.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థల్లో విశ్వ హిందూ పరిషత్ ప్రధానమైంది.
సెక్యులర్ పార్టీలు ఈ సంస్థను హిందూ తీవ్రవాద సంస్థగా పరిగణిస్తాయి.అశోక్ సింఘాల్ వంటి నేతలను పరమ చాందస వాదులుగా వ్యవహరిస్తారు.
దేశంలో మత కలహాలు చెలరేగినప్పుడల్లా విశ్వ హిందూ పరిషత్ పేరు ప్రముఖంగా వినబడుతుంది.హిందువుల పండుగలను, ఉత్సవాలను వీహెచ్పీ భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉంటుంది.







