ఒక సినిమా విడుదల చేసేముందు అన్ని రకాలుగా ఆలోచిస్తారు.అసలు సినిమాలు శుక్రవారం విడుదల చేసేదే ఆ రోజు లక్ష్మీదేవి కి సంబంధించింది అని.
గత నెల రావాల్సిన అఖిల్ ని గ్రాఫిక్స్ పనుల వల్ల దీపావళికి వాయిదా వేసారు.మరి కొత్త విడుదల తేది ప్రకటించేముందు ముహూర్తాలు, జాతకాలు సరిగా చుసుకోలేదేమో.
విషయం ఏమిటంటే, అఖిల్ సినిమా దీపావళి రోజు విడుదల అవుతోంది.ఆ రోజు విడుదల చేయడం మంచిది కాదు అని పంతులువారు చెప్పారట.
నవంబర్ 6వ తేది విడుదలకు సరైన తేది అని చెప్పేసరికి అక్కినేని ఫ్యామిలి కంగారుపడ్డారట.అప్పటికే రిలీజ్ డేట్ అన్నౌన్స్ చేసేసారు.
సినిమా పంపిణిదారులు తమ సన్నాహాల్లో ఉండగా మళ్ళి వాయిదా వేయడం కష్టం.దానితో ఒక ఉపాయం అలోచించి అమలు చేసారు అక్కినేని వారు.
నవంబర్ 6 వ తేదిన, అంటే మొన్న అఖిల్ స్పెషల్ షో వేసారు.నాగార్జున సోదరి, హీరో సుశాంత్ తల్లి నాగసుశీల 1,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారు.
అక్కినేని ఫ్యామిలి మాత్రమె సినిమాని తిలకించారు.ప్రపంచానికి నవంబర్ 11 న విడుదల తేది అయితే, శాస్త్రాల ప్రకారం నవంబర్ 6 నే సినిమా విడుదల అయిపొయింది.
అయితే ఈ నమ్మకాల వలన సినిమాలు ఆడుతాయా అంటే, దిక్కులు చూడటం తప్ప ఇంకేమి చేయలేము.సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు, బాగాలేకపోతే ఎవరు ఆడుకోలేరు.







