ఎక్కువ మీడియా సంస్థలు ఊహించిన విధంగానే జరిగింది.9 టీవీ చానళ్ళ ఎగ్జిట్ పోల్సు నిజం అయ్యాయి.బీహార్లో నితీష్ , లాలూ ప్రసాద్, సోనియా గాంధి మహా కూటమి సర్కారు ఏర్పాటు చేయడం ఖాయం అయిపొయింది.నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్ట బోతున్నారు.
ఫలితాలు పూర్తిగా ప్రకటించక పోయినా మహా కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ఘోరంగా మట్టి కరిచింది.
చెమటలు కక్కుతూ ప్రచారం చేసిన మోడీ పరువు పోయింది.మహా కూటమి -ఎన్డీయే కు మధ్య తేడా పెద్దగా ఉండదని అనుకున్నారు.
కానీ ఎన్డీయే దారుణంగా పరాజయం పాలైంది.బీజేపీ ఓటమికి కారణం అది సొంతంగా చేసిన తప్పులే అని చెప్పవచ్చు.
బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు, ఆవు మాంసం వివాదం, రిజర్వేషన్ల మీద ఆరెసెస్ అదినేత కామెంట్లు ….ఇవన్ని బీజేపీ దారుణ పరాజయానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
బీహార్లో మహాకూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.







