టాలీవుడ్‌లో గత కొంత కాలంగా థియేటర్ల సర్దుబాటు గందరగోళంను ఏర్పర్చుతోంది.బడా హీరోల పెద్ద చిత్రాలు విడుదల అయిన సమయంలో ఇతర చిన్న చిత్రాలకు థియేటర్లు లభించే ఛాన్స్ లేదు.
పెద్ద చిత్రాలు విడుదల కానున్న సమయంలో చిన్న చిత్రాల విడుదల చేయడం లేదు.గతంలో ఒక్కో పెద్ద చిత్రానికి కనీసం వారం రోజుల వ్యవధి పాటించాలని ఇండస్ట్రీ పెద్దలు ఒక ఒప్పందంకు వచ్చారు.
అయితే తాజాగా ఒక్క వారం పెద్ద చిత్రాలకు సరి పోవడం లేదని, కనీసం రెండు వారాల గ్యాప్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
‘బాహుబలి’ చిత్రం విడుదలైన రెండు వారాల వరకు మరో చిత్రం విడుదల అయ్యింది లేదు.
దాంతో ఆ చిత్రంకు కలిసి వచ్చింది.ఇప్పుడు ‘రుద్రమదేవి’ చిత్రం విడుదలైన వారం రోజులకు ‘బ్రూస్‌లీ’ చిత్రం రాబోతుంది.
‘రుద్రమదేవి’ చిత్రం భారీ బడ్జెట్ రావడంతో పాటు, మొదటి వారం రోజులు ఆశించిన కలెక్షన్స్ రాకపోవడంతో రెండవ వారం కూడా ఒంటరిగా బాక్సాఫీస్ ముందు కొనసాగితే బడ్జెట్ పూడటం ఖాయం అనుకున్నారు.ఒక్క వారం రోజుల్లో భారీ బడ్జెట్ వల్ల ‘రుద్రమదేవి’ చిత్రం పూడ్చుకోలేక పోయింది.
రేపు ‘బ్రూస్‌లీ’కి కూడా అదే పరిస్థితి ఎదురు అవ్వబోతుంది.‘బ్రూస్‌లీ’ విడుదల అయిన వారం రోజుల్లోనే ‘అఖిల్’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.
దాంతో పెద్ద చిత్రాల మధ్య కనీస వ్యవధిని రెండు వారాలకు పెంచాలని కొందరు భావిస్తున్నారు.







