‘రుద్రమదేవి’ చిత్రంతో గత వారం గుణశేఖర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.మొదటి వారం పర్వాలేదు అన్నట్లుగా కలెక్షన్స్‌ను సాధించిన ‘రుద్రమదేవి’ చిత్రం రెండవ వారం కూడా జోరు కొనసాగిస్తే గుణశేఖర్ బయట పడ్డట్లే అనుకున్నారు అంతా.
కాని రెండవ వారం ‘రుద్రమదేవి’కి ఛాన్స్ ఇవ్వడం లేదు ‘బ్రూస్‌లీ’.రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్‌లీ’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో గుణశేఖర్‌కు భారీ నష్టాలు తప్పవని అంటున్నారు.పలువురు సినీ ప్రముఖులు మంచి మనస్సుతో ‘రుద్రమదేవి’ చిత్రంకు పోటీగా ‘బ్రూస్‌లీ’ని విడుదల చేయవద్దని, వారం రోజుల తర్వాత విడుదల చేయాలంటూ కోరారు.
‘బ్రూస్‌లీ’ డేట్‌ను ముందే ప్రకటించడంతో విడుదల వాయిదా వేయడం కుదరదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.దాంతో చేసేది లేక గుణశేఖర్ ‘బ్రూస్‌లీ’ చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
తమ చిత్రంకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఫస్ట్ పాయింట్ అయ్యింది.ఇప్పుడు చిరు ‘బ్రూస్‌లీ’లో గెస్ట్ రోల్‌లో కనిపించనుండటం సినిమాకు తప్పకుండా ప్లస్ పాయింట్ అవుతుందని రుద్రమ టీం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసింది.
ఇలా గుణశేఖర్ చెప్పడం వెనుక పెద్ద ఎత్తుగడే ఉన్నట్లుగా తెలుస్తోంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నెట్టుకు రావడం కష్టం.
దానికి తోడు తన ‘ప్రతాప రుద్రుడు’ చిత్రంలో మెగా హీరోను తీసుకోవాలని గుణశేఖర్ భావిస్తున్నాడు.దాంతో గుణశేఖర్ రాజీ మార్గంలో మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యేలా ఇలా ‘బ్రూస్‌లీ’కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.







