మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ వారంలో ‘బ్రూస్‌లీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.శ్రీనువైట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్‌లో నటించిన విషయం తెల్సిందే.ఈనెల 16న విడుద కాబోతున్న ఈ చిత్రానికి అనేక అంశాలు కలిసి వస్తున్నాయి.
‘బ్రూస్‌లీ’ చిత్రం దసరా సెలవుల సమయంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.దాంతో ఈ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సెలవలు పూర్తి అయ్యే వరకు ఫుల్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి.
ఇక ఈ చిత్రంలో చిరంజీవి నటించడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం.చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి కనిపించిన ఈ చిత్రాన్ని చూడాలని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఉవ్విల్లూరుతున్నారు.
దాంతో సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి.ఇక ఈ చిత్రానికి పోటీగా మరే చిత్రం లేదు.
రుద్రమదేవి చిత్రం ఉన్నా కూడా ఇప్పటికే ఆ సినిమా ఫలితం తేలి పోయింది.యావరేజ్ టాక్‌తో నడుస్తున్న ‘రుద్రమదేవి’ చిత్రం ‘బ్రూస్‌లీ’ని అడ్డుకోవడం అసాధ్యం అని సినీ ప్రముఖులు సైతం అంటున్నారు.
లక్కీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, శ్రీనువైట్ల, కోన వెంకట్‌ల కాంబినేషన్, నదియా ఇలా ఈ చిత్రానికి పలు కలిసి వచ్చే అంశాలు కూడా ఉన్నాయి.కొన్ని ప్రతి కూల అంశాలు కూడా ‘బ్రూస్‌లీ’కి ఉన్నాయి.
ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే ‘అఖిల్’ చిత్రం రాబోతుంది.దాంతో వారంలోనే సాధ్యం అయినంతగా వసూళ్లను చరణ్ రాబట్టాల్సి ఉంది.
మొత్తానికి పాజిటివ్ బజ్‌తో రాబోతున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం ఫ్యాన్స్ ఆశించినట్లుగా 100 కోట్లు సాధిస్తుందో చూడాలి.








