స్మైలీ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తెగ పొగిడేస్తోంది.
బ్రూస్ లీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రకుల్ ” బ్రూస్ లీ నా కెరీర్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నిటిలో పెద్ద సినిమా.
నన్ను ఈ సినిమా వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది.ఈ అవకాశం ఇచ్చిన శ్రీనువైట్ల గారికి కృతఙ్ఞతలు.
ఈ సినిమాలో అసలు మర్చిపోలేని విషయం ఏమిటి అంటే అది చిరంజీవి గారితో నటించడం.బ్రూస్ లీ ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేదానికన్నా చిరంజీవి తో నటించడం అనే గుర్తింపు గురించే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను.జీవితకాలం గుర్తుండిపోయే సినిమా ఇది.” అంటూ మెగాస్టార్ ను ఆకాశానికెత్తేసింది.
ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ” చరణ్ అంత పెద్ద సినిమా కుటుంబం నుంచి వచ్చినా ఆ తాలూకు అహంకారమే ఉండదు.తను చాలా మంచి డ్యాన్సర్.
నేను సాంగ్ షూట్ కి ముందు కనీసం మూడు రోజుల టైం అడిగేదాన్ని రిహార్సల్స్ కి.అంత కష్టపడ్డా చరణ్ స్పీడ్ కి సరిపడలేకపోయాను అనుకుంటున్న ” అంటూ ముగిం
.






