బాహుబలి విడుదలై మూడో నెల కావస్తున్నా రికార్డుల దాహం ఇంకా తీరినట్టు లేదు .బాహుబలి కేవలం వెండితెర వరకే కాకుండా బుల్లి తెరపై కుడా రికార్డుల వర్షం కురిపిస్తోంది.
బాహుబలి శాటిలైట్ రైట్స్ ని మాటివీ 20 కోట్లు చెల్లించి కొనుక్కున్న విషయం తెలిసిందే .అంత పెద్ద మొత్తం పెట్టారు కాబట్టి .మొదటి టెలికాస్ట్ లోనే భారి మొత్తం వసూలు చేసే పనిలో పడింది మాటీవీ .సినిమా ప్రదర్శితం అవుతున్న సమయంలో చాలా ఆడ్స్ వస్తాయి అన్న విషయం తెలిసిందే కదా .అలా బ్రేక్ లో వచ్చే ఆడ్స్ కి భారి రేట్ చెబుతున్నారు మాటివి వాళ్ళు .ఎంత భారి అంటే … బాహుబలి టెలికాస్ట్ సమయంలో బ్రేక్ లో వచ్చే 10 సెకన్ల ఆడ్ కి 2.5 లక్షలు వసూలు చేయబోతోంది మాటీవి యాజమాన్యం .
ఎన్ని ఆడ్స్ వస్తాయి .ఎన్ని లక్షలు పోగవుతాయి అని లెక్కలు వేసి సమయం వృధా చేసుకోవద్దు .కోట్లల్లో సంపాదించబోతోంది మాటీవి.దసరా కానుకగా అక్టోబర్ 25న ఈ మూవీని బుల్లితెరపై ప్రసారం చేస్తారు.







