ఆయన చాలా సీనియర్ రచయిత, దశాబ్త కాలానికి పైగా సీరియల్లు,సినిమాలు తేడా లేకుండా మంచి కథలు రాస్తూనే ఉన్నారు.అన్ని పేరు తెచ్చినవే .
గట్టిగా చెబితే .ఇప్పుడు ఊపుమీదున్న ఒక హీరో కెరీర్ ని మార్చింది ఆయనే … టాలెంట్ చాలా ఉంది, సక్సెస్ ఉంది, కాని ఎందుకో అగ్ర రచయిత అనే స్థానం దక్కలేదు.కాని ఇప్పుడు ఆయన దశ తిరిగినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇటివలే ఒక లైన్ విన్న ఒక టాప్ హీరో, ఈ కథకు ఆ రచయిత అయితేనే బాగుంటుందని, తననే రచయితగా పెట్టుకోవాలని దర్శకుడికి సూచించారట.
కథ చర్చలు ఈ మధ్యే మొదలైన ఈ చిత్రం వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇది భారి బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
చిన్న హీరోలను స్టార్స్ గా మలిచిన ఆ రచయిత తొలిసారి అంత పెద్ద హీరోతో పనిచేయనున్నాడు.ఆ సినిమా గనుక హిట్ అయితే ఆయన దశ తిరిగినట్టే .మళ్ళి చిన్న సినిమాల జోలికి వెళ్లనక్కరలేదు.






