మంత్రులు ఇట్లా ఎందుకు మాట్లాడతారు?

మన దేశంలో మంత్రులు మరీ బరి తెగించి పోతున్నారు.ముఖ్యంగా బీజేపీ మంత్రులు సిగ్గు వదిలేసారు.

 ‘watch Videos At Night Too’-TeluguStop.com

కేంద్ర మంత్రులు, రాష్ట్రాలలోని బీజేపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు.మహారాష్ట్రలోని బీజేపీ మంత్రి గిరీష్ బాపట్ విద్యార్థుల కార్యక్రమంలో చేసిన కామెంట్ దుమారం రేపుతున్నది.

ఈ మంత్రి ఒక కాన్వోకేషన్ లో మాట్లాడుతూ మీరు (విద్యార్థులు) మొబైల్లో చూసే వీడియో క్లిప్పులు మనమందరం రాత్రి వేళ చూస్తాం.మనం పెద్ద వాళ్ళం అయిపోయామని అనుకోవద్దు.

ఇప్పటికీ మనవి యువ హృదయాలే అని మంత్రి అన్నారు.ఆయన చెప్పే వీడియో క్లిప్పులు నీలి చిత్రాలు అని అర్థం.

మంత్రి కామెంట్ మీద సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి.మంత్రికి మర్యాద లేదని, బాధ్యతా రహితంగా వ్యవహరించారని ఎన్సీపీ విమర్శించింది.

బీజేపీ మిత్ర పక్షం శివ సేన కూడా విరుచుకు పడింది.ఇది చాలా విషాదకరమని పేర్కొంది.

ఈ విమర్శలకు మంత్రి వివరణ ఇచ్చారు.తాను సరదాగా మాట్లాడానని అన్నారు.

తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు.మంత్రిగా ఉన్నా సరదాగా మాట్లాడవచ్చు.

కాని అసభ్యంగా ఉండకూడదు కదా.మంత్రికి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube