ప్రధాని నరేంద్ర మోదీ చండీఘర్ ప్రజలకు ఎందుకు క్షమాపణ చెప్పాల్సివచ్చింది? ఆయనంతటివాడు క్షమించమని కోరారంటే ఏదో పెద్ద తప్పు జరిగినట్లే కదా.అవును జరిగింది.
ప్రజలు ఆగ్రహించే పరిస్థితి ఏర్పడింది.వారి విమర్శలను అర్థం చేసుకున్నారు కాబట్టే మోదీ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా క్షమాపణ చెప్పారు.
దీని నేపథ్యం ఏమిటంటే….మోదీ ప్రధాని అయ్యాక మొదటిసారి చండీఘర్ వెళ్లారు.
ఆయన రాకను పురస్కరించుకొని రాష్ర్ట ప్రభుత్వం ‘అతి’గా వ్యవహరించింది.స్కూళ్లు, కాలేజీలు బంద్ చేశారు.
పరీక్షలను సైతం రద్దు చేశారు.ప్రధాన రోడ్లన్నీ మూసేశారు.
నగరంలోని ప్రధాన శ్మశానాన్ని వాహనాలకు పార్కింగ్ స్థలంగా మార్చారు.ఈ పరిస్థితి ప్రజలకు ఆగ్రహం తెప్పించింది.
సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగాయి.ఆదంతా తెలుసుకున్న మోదీ ఇక నుంచి ఈ హడావిడి పూర్తిగా బంద్ చేయాలన్నారు.
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు.ప్రజలకు ఇబ్బంది కలిగించినవారిపై విచారణ చేయిస్తామన్నారు.
బాధ్యలెవరో తేలుస్తామన్నారు.మోడీ రక్షణ కోసం దాదాపు ఐదువేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు.
ఈ ఓవర్ యాక్షన్‌పై ప్రతిపక్షాలు కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.మనది ప్రజాస్వామ్య దేశమైనా రాజరిక పోకడలు ఇంకా మిగిలి ఉన్నాయని ఇలాంటి ఘటనలు చూస్తే తెలుస్తోంది కదా.వీఐపీ కల్చర్‌ను నిర్మూలించకపోతే ప్రజలకు కష్టాలు తప్పవు.విదేశాల్లో ఇలా చేయరు.
నాయకులు, పాలకులు కూడా సామాన్యుల మాదిరే అన్ని నిబంధనలు పాటిస్తారు.వారిని చూసి మనోళ్లు నేర్చుకుంటే మంచిది.







