రోత కలిగిస్తున్న ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రోత కలిగిస్తున్నాయి.అందరికీ తెలిసిన విషయాల మీద, ఇప్పటివరకు అనేకసార్లు తిట్టుకున్న సంగతుల మీద అసెంబ్లీలో కూడా తిట్టుకోవాలా? ఒకే విషయం మీద ఎన్నిసార్లు తిట్టుకుంటారు? సభ్యులు కేవలం తిట్టుకోవడం కోసమే అసెంబ్లీకి వస్తున్నారు.వై కా పా అధినేత జగన్ నోటుకు ఓటు కేసును ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడంలేదు.ఇది కొత్త విషయమా? దీన్ని గురించి ఎవరికీ తెలియదా? ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద సర్కారును నిలదీయకుండా పనికిమాలిన విషయాల మీద గొడవ చేసి జగన్ ఎం సాధించాలని అనుకుంటున్నాడో తెలియడం లేదు.కోర్టులో విచారణ జరుగుతున్న నోటుకు వోటు కుంభకోణం మీద చర్చ జరగాలని గొడవ చేయడం జగన్ పిల్ల చేష్టగా చెప్పుకోవచ్చు.అందులోను దానికి ఆంధ్రాతో సంబంధం ఏమిటి? నోటుకు వోటు కుంభకోణం మీద చర్చ జరపాలని వై కా పా వాయిదా తీర్మానం ఇచ్చింది.దీన్ని స్పీకర్ రిజెక్ట్ చేసారు.దీంతో వై కా పా సభ్యులు సభలో గొడవ చేసారు.స్పీకర్ పోడియంలోకి దూసుకుపోయారు.గొడవ ఆపకపోవడంతో స్పీకర్ సభను రెండు సార్లు వాయిదా వేసారు.

 Ysrcp Uses Cash-for-vote To Corner Chandrababu-TeluguStop.com

ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుపుదామని స్పీకర్ ఎంతగా చెప్పినా వై కా పా సభ్యలు వినలేదు.వారు తమ సీట్ల నుంచి లేచి నిలబడి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

ఆడియో టేపుల్లో గొంతు ఎవరిదీ? చంద్రబాబుదా ? రేవంత్ రెడ్డిని డబ్బుతో నామినేటెడ్ ఎమ్మెల్యే దగ్గరకు ఎవరు పంపారు? అని జగన్ ప్రశ్నించారు.దీంతో కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకొని జగన్ పై విరుచుకు పడ్డారు.

జగన్ తెలంగాణా ముఖ్య మంత్రితో కుమ్మక్కై బాబుకు వ్యతిరేకంగా కుట్ర చేసారని అన్నారు.దీనిపై జగన్ స్పందిస్తూ అది నిజమని నిరూపిస్తే తను పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేసారు.

అసెంబ్లీలో ఇలాంటి గొడవ చాలా సిల్లీగా ఉంది.వీరు ప్రజలకు సేవ చేసే నాయకులా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube