ఏమిటి ఈ లెక్క? ఇది ప్రపంచంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న తెలుగువారి లెక్క.తెలుగోళ్ళు ఎవ్వరికీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు.
మైక్రో సాఫ్ట్ సీఈఒ సత్య నాదెళ్ళ తెలుగోడు.గూగుల్ సీఈఒ సుందర్ పిచాయి తమిళుడు.
ఈ జాబితాలో తాజాగా తెలుగు మహిళ చేరింది.ఆమె పేరు పద్మశ్రీ వారియర్.
ఈమె సామాజిక మీడియా అయిన ట్విట్టర్ సీఈఒగా నియమితులయ్యారు.పద్మశ్రీ విజయవాడకు చెందిన మహిళ.
ట్విట్టర్ కు ఈ ఏడాది జూన్ నుంచి సీఈఒ లేరు.ఆ సంస్థ పోస్టు కోసం అభ్యర్థిని వెతుకుతున్న సమయంలో పద్మశ్రీ పై ద్రుష్టి పడింది.
దీంతో ఆమెను ఎంపిక చేసారు.ఈమె విజయవాడకు చెందిన సుబ్రమణ్య గాంధి కూతురు.
పద్మశ్రీ ఇంటర్ వరకు విజయవాడలోనే చదివారు.దిల్లీలో ఉన్నత విద్య పూర్తి అయిన తరువాత అమెరికాలో సెటిల్ అయ్యారు.
మొన్నటి వరకు ఆమె సిస్కో సంస్థకు సీఈఒగా పనిచేసారు.పద్మశ్రీ ట్విట్టర్ కు సీఈఒగా నియామకం అయినందుకు విజయవాడలో సంతోషం వెల్లివిరుస్తున్నది.
ఆమె గురువులు ప్రశంసలు కురిపిస్తున్నారు.పద్మశ్రీ తండ్రి లాయరుగా చాలా మందికి పరిచయం.
తెలుగు ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో చాటిన పద్మశ్రీ కి తెలుగు స్టాప్ కూడా అభినందనలు చెబుతున్నది.