గోదావరిలో మునగడమంటే పుష్కరాల సందర్భంగా పుణ్యస్నానం చేయడమని అర్థం.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం ఈ పనే చేశారు.
రాజమండ్రిలోని కొవ్వూరు పుష్కరఘాట్‌లో ఆయన పుణ్య స్నానం చేశారు.ఈయన వెంట తల్లి విజయమ్మ, భార్య భారతి తదితరులు ఉన్నట్లు సమాచారం లేదు.
జగన్ ఏదో నామమాత్రపు స్నానం చేయకుండా గోదావరి నదీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు.పండితులు వేదమంత్రాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
స్వర్గస్తులైన తన వంశంలోని పెద్దలకు (తండ్రి వైఎస్సార్ సహా) హిందూ సంప్రదాయం ప్రకారం పిండ ప్రదానం చేశారు.తర్పణాలు వదిలారు.
అప్పన్నస్వామి ఆలయాన్ని సందర్శించారు.క్రైస్తవుడైన జగన్ చేసిన ఈ పనుల్లో కొంత రాజకీయ కోణం ఉండొచ్చు.
మరికొంత హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేదా సెంటిమెంటు ఉండొచ్చు.ఎందుకంటే ఆయన క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నా హిందూ సమాజం నుంచి వచ్చిన కులాన్ని వదులుకోలేదు.
కొన్ని సంప్రదాయాలను కూడా వదులుకోకపోయుండొచ్చు.రాజకీయాల్లో ఉన్న వ్యక్తి సర్వ మతాలను సమంగా చూసే మనస్తత్వం కలవాడై ఉండాలి కదా….! రాజకీయ నాయకుడు మెజారిటీ ప్రజల మనో భావాలను గౌరవించకపోతే వ్యతిరేకత ప్రబలే అవకాశం ఉంటుంది.కాబట్టి ఆయన హిందూ ఆలయాలకు వెళుతున్నారు.సంప్రదాయాలు పాటిస్తున్నారు.జగన్ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో లేరు కాబట్టి వారికి ఇలా చేయాల్సిన అవసరం లేదు.
అందుకే విజయమ్మ బైబిల్‌ను వదలిపెట్టకుండా పట్టుకొని తిరుగుతారు.అది ఆమె విశ్వాసం.
ఆమెలా జగన్ ఉండటం సాధ్యం కాదు.







