ఎదిగేకొద్దీ ఒదిగి ఉండదా....!

‘ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి’ అంటారు పెద్దలు.ఈ సూత్రం ఏ రంగంలోనైనా రాణించడానికి ఉపయోగపడుతుంది.

 Rakul Preeth Sing Harsh Comments On Trisha And Tamanna-TeluguStop.com

టాలెంట్‌తో పాటు అంతకంటే ఎక్కువగా అదృష్టం కీలకమైన రోల్‌ ప్లే చేసే సినిమా రంగంలో ఒదిగి ఉండటమనేది అత్యంత ముఖ్యం.ఒదిగి ఉండటంమంటే ఎదుటివాళ్ల కంటే మనం తక్కవని ఫీల్‌ అవకూడదు.

వారి ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పనిలేదు.ఒదిగి ఉండటమంటే సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వడం.

తెలుగు సినిమా స్వర్ణ యుగంలో ఈ లక్షణం సినీ రంగంలో అందరికీ ఉండేది.ఆ రోజుల్లో హీరో హీరోయిన్లు తారాపథంలోకి దూసుకెళ్లినా సీనియర్లను ఎంతో గౌరవించేవారు.

ఈ తరం నటీనటుల్లో ఈ లక్షణం లోపిస్తోంది.ఇందుకు తాజా ఉదాహరణగా ప్రస్తుతం తెలుగులో బాగా డిమాండ్‌ ఉన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను చెప్పుకోవచ్చు.
ఈమెకు ఓ పక్క డిమాండ్‌ పెరుగుతున్న కొద్దీ, మరోపక్క ‘నోటి దురుసు’ కూడా పెరుగుతోందనే వార్తలు వస్తున్నాయి.సీనియర్‌ హీరోయిన్లను తక్కువ చేసి మాట్లాడుతోందని, వారిని అవమానపరిచే కామెంట్లు చేస్తోందని సినిమా కోళ్లు కూస్తున్నాయి.

వెంకటాద్రి ఎక్‌్సప్రెస్‌, లౌక్యం సినిమాలు హిట్‌ అవడంతో అమ్మడి రేంజ్‌ పెరిగిపోయింది.కొత్త అందాల కోసం అర్రులు చాచే తెలుగు సినిమా పరిశ్రమ రకుల్‌ వెంట పడింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.బ్రహ్మోత్సవంలో మహేష్‌ సరసన అవకాశం కొద్దిలో మిస్సయింది.పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం ఆమెకే కాదు మనకూ సంతోషమే.ఇది ఆమె అదృష్టం.

అయితే అదే సమయంలో సీనియర్‌ హీరోయిన్లు అయిన త్రిష, తమన్నావంటివారిపై అవాంఛనీయమైన కామెంట్లు చేయడమెందుకు? ఆ ఇద్దరు హీరోయిన్లు బాలీవుడ్‌కు వెళ్లి అపజయాలు మూటగట్టుకున్నారని, వారితో తనను పోలుస్తున్నారని, తానెక్కడ? వారెక్కడ? అని మండిపడుతోందట…! ఇదివరకు కూడా వీరిని తక్కువ చేసి మాట్లాడిందట.త్రిష దశాబ్దం పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.

ఆమె చిత్రాలు వెర్రెక్కించాయి.తమన్నా కూడా తెలుగు ప్రేక్షకులను సమ్మోహన పరిస్తోంది.

వారిద్దరూ కమిట్‌మెంట్ ఉన్నవారని, కష్టపడి పనిచేస్తారని పేరుంది.అలాంటివారి నుంచి రకుల్ వంటి కొత్త హీరోయిన్లు ఎంతో కొంత నేర్చుకోవాలి.

అది ఇష్టం లేకుంటే గమ్మున ఉండాలి.అంతే తప్ప అనవసరమైన కామెంట్లు చేస్తే తెలుగు సినిమా పరిశ్రమలో చిరునామా గల్లంతవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube