రాష్ర్టం విడిపోయాక అన్నింటినీ రెండు ముక్కలు చేసినట్లే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఏపీపీఎస్‌ని కూడా రెండు ముక్కలు చేసిన సంగతి తెలిసిందే.తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సి) ఘాంటా చక్రపాణి చైర్మన్‌గా ఏర్పాటైంది.
ఏపీపీఎస్‌కి సంబంధించిన వాసనలు వదిలించుకున్న కొత్త సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్ తయారు చేసింది.సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూపు వన్ ఉద్యోగాల పరీక్షల్లో ‘తెలంగాణ ఉద్యమం’ కీలక సబ్జెక్టుగా మారింది.
గ్రూపు వన్ పరీక్షకు తొమ్మిది వందల మార్కులు నూటయాభై మార్కుల పేపరు తెలంగాణ ఉద్యమ చరిత్ర మీదనే ఉంది.అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రపై పట్టు లేకపోతే పరీక్ష పాస్ కావడం కష్టమన్నమాట.
తెలంగాణ సంస్కృతి, వైభవం, చరిత్ర , ఆర్థిక అంశాలు ఇతర సబ్జెక్టులుగా ఉన్నాయి.గ్రూపు వన్ లో వెయ్యి మార్కులు ఉంటాయని, నూటయాభై మార్కులు తెలంగాణ ఉద్యమం, రాష్ర్ట ఏర్పాటు మోదలైనవాటికి కేటాయించారని, వంద మార్కులు ఇంటర్వ్యూకు ఉంటాయని సర్వీస్ కమిషన్ వర్గాలు చెప్పాయి.
కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారంతా తెలంగాణ ఉద్యమాన్ని గురించి బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.తెలంగాణ చరిత్ర గురించి కూడా క్షణ్నంగా తెలుసుకోవాలి.
ఆంధ్రా చరిత్రతో, అక్కడి సాహిత్యంతో విద్యార్థులకు పనిలేదు.అదంతా వలసవాదులకు సంబంధించింది.
తెలంగాణ ఉద్యమం అధ్యయనం చేసేటప్పుడు కేసీఆర్ పాత్రను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.కాబట్టి ఈ విధంగా కేసీఆర్ ఎప్పటికీ విద్యార్థుల నోట్లో నానుతూ ఉంటారు.
పోటీ పరీక్షల విద్యార్థులంతా ఆయన్ని స్మరించుకోవలసిందే.







