రానా సినిమాకు టైటిల్‌ కష్టాలు

హీరో రానా ‘బాహుబలి’తో ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాడు.ప్రస్తుతం ఈయన ఫుల్‌ హ్యాపీగా ఉన్నాడు.

 Political Problems For Rana’s Movie-TeluguStop.com

అయితే ఈయన్ను చిన్న సమస్య వెంటాడుతోంది.‘బాహుబలి’ మొదటి పార్ట్‌ను పూర్తి చేసిన తర్వాత రానా మయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘బెంగళూరు డేస్‌’ తమిళ రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పాడు.

ఇప్పటికే దాదాపు సగానికి పైగా చిత్రీకరణ పూర్తి అయ్యింది.ఇక ఈ సినిమాకు ‘ఎడిఎంకే’ టైటిల్‌ను నిర్ణయించారు.

అయితే ఆ పేరుతో తమిళనాడులో ఒక పార్టీ ఉంది.దాంతో ఇప్పుడు ఆ పార్టీకి చెందిన వారి నుండి ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇంతకు ఈ సినిమాకు ‘ఏడిఎంకే’ అని ఎందుకు పెట్టారు అంటే సినిమాలో అర్జున్‌, దివ్య, మాత్రుమ్‌, కార్తీక్‌లు స్నేహితులు.ఈ ముగ్గురి నేపథ్యంలో సాగే సినిమా కనుక వారి పేర్లు వచ్చేలా షార్ట్‌ ఫాంలో ఈ టైటిల్‌ను నిర్ణయించడం జరిగింది.

అయితే తాజాగా సదరు పార్టీ నాయకు ఒత్తిడి చేయడంతో చిత్రం టైటిల్‌ను మార్చాని నిర్ణయించారు.త్వరలోనే కొత్త టైటిల్‌ను ఫిక్స్‌ చేసే అవకాశాలున్నాయి.

ఇక ఈ సినిమాను ఇదే సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో రానాతో పాటు ఆర్య, బాబీ సింహా, శ్రీదివ్యలు నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube