టాలీవుడ్ జక్కన్న రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈ సినిమా కోసం ప్రేక్షకులు గత కొంత కాలంగా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
దాంతో ఈ సినిమా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు.ఇక ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి.
సినిమా విడుదకుల ముందు ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని చిత్ర యూనిట్ సభ్యులు భావించారు.కాని వారి అంచనాలను మించేలా భారీ భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి.
ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమాకు కూడా రాని స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా 24 కోట్ల మొదటి రోజు వసూళ్లను దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఇందులో సగం కలెన్స్‌ను వసూళ్లు చేయలేక పోయింది.ఇక ఓవర్సీస్ మరియు తమిళ, హిందీల్లో కూడా ఈ సినిమా భీభత్సమైన కలెక్షన్స్‌ను రాబట్టింది.
ఈ స్థాయి ఓపెనింగ్స్ ఇప్పట్లో ఏ సౌత్ సినిమాకు వచ్చే ఛాన్స్ లేదు అంటూ సినీ ప్రముఖు సైతం గట్టిగా చెబుతున్నారు.







