‘బాహుబలి’ పుణ్యాన్న రానా..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ‘బాహుబలి’ ఫీవర్‌ కొనసాగుతోంది.ఇప్పటికే దేశ వ్యాప్తంగా అశేష ఆధరణ దక్కించుకున్న ‘బాహుబలి’ కోసం మరింతగా ప్రచారం చేస్తున్నారు.

దాంతో ఈ సినిమాలో విలన్‌ పాత్రలో నటించిన రానాకు కూడా కొత్త గుర్తింపు దక్కుతోంది.ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉండే రానా తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ట్విట్టర్‌లో ఒక మిలియన్‌ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్‌ హీరోల సరసన రానా కూడా చేరాడు.రానాకు ‘బాహుబలి’ వల్లే ఇంత క్రేజ్‌ అనేది అందరు ఒప్పుకోవాల్సిన నిజం.

తెలుగులో ఎలాగూ హీరోగా మంచి గుర్తింపే ఉన్న రానా తమిళం మరియు మలయాళంతో పాటు బాలీవుడ్‌లో మరింత గుర్తింపును తెచుకున్నాడు.ఆ గుర్తింపు వల్లే ట్విట్టర్‌లో రానా ఫాలోవర్స్‌ పెరిగారు అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

ఇక ఈ సినిమా విడుదల తర్వాత రానాకు మరింతగా ఆధరణ లభించడం ఖాయం అని, ‘బాహుబలి’ రెండవ పార్ట్‌లో కూడా రానా ముఖ్య పాత్ర అవ్వడంతో ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య డబుల్‌ అయినా అయ్యే అవకాశాలున్నాయి అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.రానా విలన్‌గా నటించిన ‘బాహుబలి’ సినిమా వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు