'నకిలీ' ఆయనకు తెలుసు

‘అసలు’ వ్యక్తికి ‘నకిలీ’ గురించి తెలుసట….! అసలు ఏమిటి….

 Arvind Kejriwal Knew Jitender Singh Tomar Possessed Fake Degree-TeluguStop.com

నకిలీ ఏమిటి? అనుకుంటున్నారా? అసలు వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.ఆయనకు తెలిసిన నకిలీ ఏమిటంటే….

మొన్నటి వరకు ఆయన దగ్గర న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన జితేంద్ర సింగ్‌ తోమర్‌ ‘లా’ డిగ్రీ.తోమర్‌ లా డిగ్రీ సర్టిఫికెట్‌ అసలుది కాదని ‘దొంగ’ సర్టిఫికెట్‌ అని తేలగానే పోలీసులు ఆయన్ని అరెస్టు చేసిన సంగతి తెలుసు.

అయితే తోమర్‌ దగ్గర ఉన్నది దొంగ సర్టిఫికెట్‌ అనే విషయం సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ముందే తెలుసునని, అయినా గమ్మున ఉన్నాడని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మాజీ నాయకుడు యోగేంద్ర యాదవ్‌ ఆరోపించారు.నకిలీ డిగ్రీ విషయం తెలిసి కూడా దానిపై విచారణ జరిపించలేదన్నారు.

తాను ఆప్‌లో ఉన్నప్పుడు అనేకమంది నకిలీ డిగ్రీల గురించి ప్రశ్నించానని, అయినా చర్యలు తీసుకోలేదని అన్నారు.యోగేంద్ర యాదవ్‌ ఈ విమర్శలు ఎందుకు చేశారంటే…తోమర్‌ దగ్గర నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌ ఉన్న సంగతి తనకు తెలియదని, తప్పుడు సర్టిఫికెట్‌ చూపి (అసలు సర్టిఫికెట్‌ మాదిరి) తనను మోసం చేశాడని అన్నారు.

అయితే ఇది అబద్ధమని కేజ్రీకి అసలు సంగతి తెలుసునని యాదవ్‌ విమర్శించారు.రాజకీయ నాయకులు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఒకరి తప్పులను మరొకరు బయట పెట్టుకోరు.

ఇద్దరి మధ్య చెడితేనే ‘అసలు’ విషయాలు బయటకొస్తాయి.కాబట్టి రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావడం మంచిదే.

ప్రజలకు నిజాలు తెలుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube