టీటీడీపీ ఫైర్‌బ్రాండ్, ముడుపుల కేసులో నిందితుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆశ నిరాశ అయింది.ఈ రోజు బెయిల్ ఇస్తారని ఆయన ఆశించారు.
కాని ఆయన ఆశలపై హైకోర్టు న్యాయమూర్తి నీళ్లు చల్లారు.బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.
బెయిల్ ఇస్తే రేవంత్ రెడ్డి సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని ఏసీబీ వాదించడంతో ఎటూ తేల్చుకోలేని నాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.రేవంత్ రెడ్డి జైల్లో ఉండబట్టి ఇప్పటికి మూడు వారాలైంది.
ఒక రాజకీయ నాయకుడి విషయంలో ఇది దీర్ఘకాలికమనే చెప్పాలి.ఇంతకన్నా ఎక్కువ రోజులు కస్టడీలో ఉన్న నాయకులు ఉన్నారనుకోండి.
అది వేరే విషయం.రేవంత్‌కు బెయిల్ రావాలని కోరుతూ ఆయన అభిమానులు దేవుడికి చేసిన ప్రత్యేక పూజలు ఫలించలేదు.
రేవంత్ చేసింది తప్పయినప్పుడు దేవుడు మాత్రం ఏం చేయగలడు.? మంగళవారం వందశాతం బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాది మీడియాకు చెప్పారు.ఓ పక్క రేవంత్ కథ ఇలా నడుస్తుండగానే టీడీపీ నేతలు తమ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మరో సారి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.ఏ కథ ఎలా మలుపు తిరుగుతుందో మరి……!
.






