ఈ వారం ప్రేక్షకుల ముందుకు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ చిత్రం రావాల్సి ఉంది.కాని ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానందున విడుదల వాయిదా వేస్తున్నట్లుగా గుణశేఖర్ ప్రకటించాడు.
ఆ తర్వాత ఈ వారం అల్లరి నరేష్ ‘జేమ్స్‌బాండ్’ సినిమాను విడుదల చేస్తాను అంటూ ప్రకటించాడు.అయితే అది కూడా సేఫ్ జోన్‌లో వస్తాను అంటూ విడుదల వాయిదా వేసుకోవడం జరిగింది.
ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రధాన చిత్రం ‘టైగర్’.
సందీప్ కిషన్ హీరోగా రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలో శీరత్ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 26న విడుదలకు సిద్దం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమాను దాదాపుగా 200 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.అందులో ముఖ్యమైనది ‘జాదుగాడు’.
నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.అయినా కూడా ‘టైగర్’ను మించే స్థాయి మాత్రం జాదుగాడికి లేదు.
దాంతో ఈ వారం ‘టైగర్’ దుమ్ము రేపే అవకాశాలున్నాయి.







