‘భలే భలే మొగాడివో’ సినిమాను పూర్తి చేసుకున్న నాని త్వరలో 14 రీల్స్ బ్యానర్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు.ఇటీవలే ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న 14 రీల్స్ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటి వరకు చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, సూర్య వంటి స్టార్ హీరోలతో నటించిన కాజల్ అవకాశాలు పెద్దగా లేక పోవడంతో నానితో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాకు కాజల్ తప్పకుండా ప్లస్ పాయింట్ అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది.అయితే నాని ఫ్యాన్స్ మాత్రం కాజల్ హీరోయిన్‌గా సూట్ అవ్వదని తేల్చేస్తున్నారు.
నాని సరసన కాజల్ నటిస్తే ఆయనకు అక్కగా కనిపిస్తుందని అంటున్నారు.వీరిద్దరి కాంబినేషన్ అసలు సెట్ అవ్వదని సినీ వర్గాల్లో కొందరు కూడా అంటున్నారు.
మరి కాజల్‌తో రొమాన్స్ చేసేందుకు నాని ఎలా ఒప్పుకున్నాడో అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు.అసలు ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించనుందా లేక మరే ముఖ్య పాత్రలో అయినా నటిస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది.
ఈ విషయంపై 14 రీల్స్ సంస్థ ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.







