అల్లరి నరేష్ హీరోగా సాయికిశోర్ మచ్చ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జేమ్స్‌బాండ్’.చడీ చప్పుడు కాకుండా ప్రారంభం అయ్యి, విడుదలకు సిద్దం అయిన ఈ సినిమాను గత నెల చివరి వారంలో విడుదల చేయాలనుకున్నారు.
కాని అల్లరి నరేష్ పెళ్లి బిజీ వల్ల విడుదల వాయిదా వేయడం జరిగింది.పెళ్లి హడావుడి పూర్తి అయ్యింది.
అయినా కూడా ఇప్పటి వరకు ‘జేమ్స్‌బాండ్’లో కదలిక లేదు.ఈ సినిమా గురించిన వార్తలు కూడా మీడియాకు అందడం లేదు.
అసలు ఈ నెలలో ఈ సినిమా విడుదల ఉందా లేదా అనేది అనుమానంగా ఉంది.
లేడీ డాన్‌కు భయపడే భర్తగా ఈ సినిమాలో అల్లరోడు కనిపించనున్నాడు.
సినిమా టైటిల్ ‘జేమ్స్‌బాండ్’ (నేను కాదు నా పెళ్లం) ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.ఇక ఆ మధ్య విడుదలై ట్రైలర్ కూడా ఆ అంచనాలను పెంచింది.
దాంతో సినిమా విడుదల కోసం సినీ పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి అల్లరోడు తన పెళ్లాం జేమ్స్‌బాండ్‌ను ఎప్పుడు తీసుకు వస్తాడో చూడాలి.
ఈ సినిమాను రామబ్రహ్మం నిర్మించాడు.







