ఇప్పట్లో కిక్‌ లేనట్లేనా?

రవితేజ, సురేందర్‌ రెడ్డిల కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్‌’ సినిమా ఘన విజయం సాధించడంతో మళ్లీ అదే కాంబినేషన్‌ ‘కిక్‌`2’ సినిమా తాజాగా తెరకెక్కింది.ఈ సినిమాను గత నెలలోనే విడుదల చేయాలని భావించారు.

 Kick 2 Movie Release In August..?-TeluguStop.com

కాని పరిస్థితులు అనుకూలించక పోవడంతో రెండవ కిక్‌ విడుదల కాలేదు.ఈనెల 26న విడుదలకు ప్లాన్‌ చేస్తున్నా కూడా ఆ డేట్‌కు విడుదల అయ్యేది కష్టమే అని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బిజినెస్‌ కాకపోవడం వల్లే రిలీజ్‌ సమస్య ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు.

ఈనెల 26న విడుదల చేసేందుకు నిర్మాత కళ్యాణ్‌ రామ్‌ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఒకవేళ ఈ నెలలో విడుదల కాని పక్షంలో సినిమా విడుదల ఆగస్టు వరకు వెయిట్‌ చేయాల్సిందే.జులైలో రెండు భారీ సినిమాలున్నాయి.

‘బాహుబలి’తో పాటు మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమాలు కూడా జులై నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.దాంతో జులై నెలలో ఇతర సినిమాలు ఏవీ కూడా బరిలోకి దిగే అవకాశాలు లేవు.

అందుకే ‘కిక్‌`2’ సినిమా ఆగస్టులో వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube