అందరి దృష్టి రుద్రమపై

గత రెండు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు ‘బాహుబలి’ మరియు ‘రుద్రమదేవి’ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు వస్తున్నారు.ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్దం అయ్యాయి.

 Rudramadevi To Be Release Before Baahubali-TeluguStop.com

కొన్ని నెలల ముందే ‘రుద్రమదేవి’ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాలు పెట్టుకున్న రుద్రమదేవి సినిమా ట్రైలర్‌ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

అయినా కూడా సినిమాపై ప్రేక్షకుల్లో నమ్మకం ఉంది.కాని అనేక కారణాల వల్ల ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో విఫలం అవుతూ వస్తున్నాడు.

తాజాగా ‘బాహుబలి’ ట్రైలర్‌ వచ్చి సంచలనాలను సృష్టిస్తోంది.

ఈ రెండు సినిమాలు ఢీ అంటే ఢీ అంటాయి అనుకున్న ప్రేక్షకులను ఆశ్చర్యపర్చుతు ‘బాహుబలి’ ముందు ఏమాత్రం తన ప్రభావాన్ని ‘రుద్రమదేవి’ చూపించలే కపోయింది.

‘బాహుబలి’ ట్రైలర్‌ చూసిన తర్వాత రుద్రమదేవి కోసం గుణశేఖర్‌ పడ్డ కష్టం జక్కన్న పడ్డ కష్టంలో పది శాతం కూడా లేదని తేలిపోయింది.‘బాహుబలి’ విడుదల తర్వాత ‘రుద్రమదేవి’ సినిమా విడుదల అయితే ప్రేక్షకులు తప్పకుండా తిప్పి కొడతారు.

దాంతో ‘బాహుబలి’ విడుదలకు ముందే రుద్రమను తీసుకు రావడం గుణశేఖర్‌కు చాలా మంచిదని అంటున్నారు.మరి గుణశేఖర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతం అయ్యి ఉంది.

ఈ రెండు సినిమాల్లో కూడా ముఖ్య పాత్రలో అనుష్క నటించిన విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube