నేనే ఆపేశా

టీటీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావును టీఆర్ఎస్‌లోకి రాకుండా తానే ఆపేశానని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.తెలంగాణను మోసం చేసిన ఎర్రబెల్లికి టీఆర్‌ఎస్‌నుగాని, దాని విధానాలనుగాని విమర్శించే హక్కు లేదన్నారు.

 Kadiyam Blocks Entry Of Tdp Leader Errabelli Into Trs-TeluguStop.com

తెలంగాణను ఎవరైతే మోసం చేస్తారో వారికి టీఆర్‌ఎస్‌లో స్థానం ఉండదన్నారు.శ్రీహరి చెప్పినదాన్నిబట్టి చూస్తే ఆయన అడ్డుకోకుండా ఉన్నట్లయితే దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యేవాడని తెలుస్తోంది.

ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరతాడని ఒకప్పుడు పుకార్లు వచ్చాయి.అప్పట్లో ఆయన ఒక్కడి మీదనే కాదు అనేకమంది మీద ఫిరాయింపు ప్రచారం జరిగింది.

టీఆర్ఎస్‌లో చేరేది లేదన్న కొందరు నాయకులు చేరిపోయారు.తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు కూడా చేరి పదవులు సంపాదించుకున్నారు.

తెలంగాణను మోసం చేసినవారికి టీఆర్ఎస్‌లో స్థానం లేదని చెప్పిన శ్రీహరి అలాంటివారు ఎవరూ ఆ పార్టీలో లేరని నిరూపించగలరా? దయాకర్‌రావుకు, ఆయనకు వ్యక్తిగత వైషమ్యాలు ఉన్నాయి.అందుకే అడ్డుపుల్ల వేశారేమో….!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube