మహేష్‌ టైటిల్‌ అధికారిక ప్రకటన

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజా చిత్రం టైటిల్‌ విషయంలో క్లారిటీ వచ్చింది.మొదట ఈ సినిమాకు టైటిల్‌గా ‘మగాడు’ అని అన్నారు.

ఆ తర్వాత ‘శ్రీమంతుడు’ అని అన్నారు.ఎక్కువ రోజులు ‘శ్రీమంతుడు’తో ప్రచారం చేశారు.

అయితే తాజాగా మరోసారి ‘మగాడు’ టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది.‘శ్రీమంతుడు’ టైటిల్‌ క్లాస్‌గా ఉందని, ‘మగాడు’ మాస్‌గా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆ టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు టైటిల్‌ను ‘శ్రీమంతుడు’ అని ఫిక్స్‌ అయ్యింది.తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా ప్రకటించాడు.

Advertisement

కథానుసారం ‘శ్రీమంతుడు’ టైటిల్‌ సరిగా సూట్‌ అవుతుందని భావిస్తున్నట్లుగా దర్శకుడు సుకుమార్‌ చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా శృతిహాసన్‌ నటిస్తోంది.

జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మే 31న సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆడియోను జూన్‌లో విడుదల చేసి, సినిమాను జులై 17న విడుదల చేసేందుకు ఏర్పాట్లు షురూ చేస్తున్నారు.

‘మిర్చి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా తర్వాత కొరటాల శివ చేస్తోన్న ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు