దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన రామ్ ‘పండుగ చేస్కో’ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్దం అవుతోంది.ఇప్పటికే ఆడియో విడుదలైన ఈ సినిమాపై పెద్దగా ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు లేవు.
అయితే చిత్ర యూనిట్ సినిమాపై అంచనాలను పెంచేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తోంది.త్వరలో విడుదల ఉండగా సినిమాపై అంచనాలు పెంచేందుకు భారీగా ప్రమోషన్ చేయాలని నిర్ణయించారు.
అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు రైటర్‌గా పని చేసిన కోన వెంకట్ ఈ సినిమాపై భారీ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
తాజాగా ఈయన ట్విట్టర్‌లో ఈ సినిమాపై స్పందిస్తూ… తాజాగా ‘పండుగ చేస్కో’ ఎడిట్ చేసిన వర్షన్ చూశాను.చాలా బాగుంది.
అందరికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.అన్ని వర్గాల ప్రేక్షకులు పండుగ చేసుకునే విధంగా ఈ సినిమా వచ్చిందని అంటున్నాడు.
ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయట.ఆడియో విడుదలకు ముందు ఈ సినిమా నిర్మాత పరుచూరి కిరీటికి మరియు హీరో రామ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ కథనాలు వచ్చాయి.
అయితే ఆ విభేదాలు తొలిగి పోవడంతో సినిమా ప్రమోషన్‌లో దృష్టి పెట్టారు.త్వరలో ఈ సినిమా విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో రామ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ మరియు సోనాల్ చౌహాన్‌లు నటించారు.







