కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాల నుంచి తిరిగొచ్చాక ప్రధాని నరేంద్ర మోదీపై రెచ్చిపోతున్నారు.‘దులపర బుల్లోడా.దుమ్ము దులపర బుల్లోడా’ టైపులో పార్లమెంటులో చెలరేగిపోతున్నారు.ప్రతిపక్ష నాయకుడి హోదా తీసుకోవడానికి నిరాకరించిన రాహుల్ ఇప్పుడు అసలైన ప్రతిపక్ష నేతలా వ్యవహరిస్తున్నారు.గురువారం నాలుగోసారి ప్రధాని మోదీపై అటాక్ చేశారు.గతంలో బిల్లుల గురించి దాడి చేసిన యువరాజు ఈసారి తన సొంత నియోజకవర్గంలోని సమస్యను ప్రస్తావించారు.
రాజకీయాల్లో మార్పు తెస్తానని చెప్పిన మోదీ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.ఆయన నియోజకవర్గమైన అమేథిలో యూపీఏ హయాంలో ప్రతిపాదించిన ఫుడ్ పార్కును మోదీ ప్రభుత్వం రద్దు చేసింది.
దీనిపై రాహుల్ పార్లమెంటులో ప్రశ్నించారు.ఎన్నికలకు ముందు మోదీ అమేథిలో యాభైరెండు నిమిషాలు ప్రసంగించారని, ఆ ప్రసంగం తనను ఆకట్టుకుందని, ఆయన తన ప్రసంగంలో రాజకీయాలను మార్చాలని అన్నారని, కాని ధ్వంసం చేశారని రాహుల్ విమర్శించారు.
ఆయన ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.రాజకీయాల్లో ప్రతీకారం అండర్ కరెంటు మాదిరిగా ఉంటుంది.
ప్రత్యర్థులకు షాక్ ఇవ్వడమే అధికారంలో ఉన్నవారి పని.







